రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయపోల్ మండలం రామ్‌సాగర్‌లో దుబ్బాక ఉపఎన్నికలపై కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధిని గుర్తుచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు: జీవన్‌రెడ్డి - మ్‌సాగర్‌లో దుబ్బాక ఉపఎన్నికలపై కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం
రాయపోల్ మండలం రామ్‌సాగర్‌లో దుబ్బాక ఉపఎన్నికలపై కాంగ్రెస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. గత మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో తెరాస అమలుచేయలేదని విమర్శించారు. నిరుద్యోగభృతి చెల్లిస్తానన్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు.
నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు: జీవన్‌రెడ్డి
గత ఎన్నికల హామీలను తెరాస పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్న జీవన్‌రెడ్డి.. రెండున్న లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు.
ఇవీ చూడండి:'నాకు ఈ అవకాశం దురదృష్టంతో వచ్చింది'