తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ నిధుల నుంచి అంబులెన్స్​: బొమ్మ శ్రీరామ్​ - former mp ponnam prabhakar latest news

హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన నిధులతో ఆంబులెన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ బొమ్మ శ్రీరామ్​ తెలిపారు. అంబులెన్స్​ ఏర్పాటు చేయాలని 20 రోజులుగా నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.

mlc jeevan reddy arrange ambulance to husnabad hospital in siddipet district
ఎమ్మెల్సీ నిధుల నుంచి అంబులెన్స్​: బొమ్మ శ్రీరామ్​

By

Published : Sep 4, 2020, 5:11 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన నిధులతో ఆంబులెన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ బొమ్మ శ్రీరామ్​ తెలిపారు. అంబులెన్స్​ ఏర్పాటు చేయాలని 20 రోజులుగా నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.

మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి అంబులన్స్ సమస్యను తీసుకెళ్లగా తన నిధుల నుంచి అంబులెన్స్​ ఏర్పాటు చేస్తానని అంగీకరించినట్లు తెలిపారు. ఈ విషయమై జీవన్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్​ హెల్త్, ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. హుస్నాబాద్​ ఆస్పత్రిని 100 పడకలుగా మార్చే విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్తానని జీవన్​ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండిధోనీ 'పబ్​జీ' ఆపేసి ఆ గేమ్​ ఆడుతున్నాడట!

ABOUT THE AUTHOR

...view details