సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన తొమ్మిది వందల కుటుంబాలకు ఎమ్మెల్యే పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో పట్టాదారుకు పాసు పుస్తకం అందాలంటే.. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేదని, లంచాలు ఇవ్వక తప్పేది కాదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టాదారుకు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా పాసు పుస్తకాలు అందిస్తున్నామని అన్నారు.
పైసా ఖర్చు లేకుండా.. పాసుబుక్కులు ఇస్తున్నాం’ - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
తెలుగుదేశం, కాంగ్రెస్ పాలనలో తొమ్మిది వందల పాసుబుక్కులకు సుమారు పది లక్షల రూపాయలు చేతులు మారేవని.. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా పట్టాదారుకు పాసు బుక్కులు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది అని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక బాలాజీ ఫంక్షన్ హాలులో తొమ్మిది వందల మందికి పాసు పుస్తకాలు అందించారు.
పైసా ఖర్చు లేకుండా.. పాసుబుక్కులు ఇస్తున్నాం’
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. లంచాలు తీసుకోకుండా అధికారులు పాసు పుస్తకాలు ఇవ్వాలని, ఎవరైనా లంచాలు అడిగితే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా అందరికీ సమానంగా సేవలందించే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గన్నె వనిత, ఎంపీపీ పుష్పలత, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.