చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని పల్లెలను,పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 16వ వార్డులో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
'సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందరూ జాగ్రత్త పడాలి' - Sanitation program
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 16వ వార్డులో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. జూన్ 1 నుంచి జూన్ 8 వరకు నిర్వహించనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.
!['సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందరూ జాగ్రత్త పడాలి' 'సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందరూ జాగ్రత్త పడాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:08-tg-srd-46-01-mlaparishudhapanulaparyavekshana-av-ts10124-01062020164019-0106f-1591009819-105.jpg)
'సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందరూ జాగ్రత్త పడాలి'
జూన్ 1 నుంచి జూన్ 8 వరకు నిర్వహించనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో తీవ్ర కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవ ఎనలేనిదని కొనియాడారు.