సిద్ధిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వాసుపత్రి వద్ద 100 మొక్కలు నాటే కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వాసుపత్రుల వద్ద 100 మొక్కలు నాటాలి : ఎమ్మెల్యే సోలిపేట - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
ప్రభుత్వాసుపత్రుల వద్ద 100 మొక్కలు నాటి.. ఆస్పత్రులను పచ్చదనానికి, ఆరోగ్యానికి కేంద్రాలుగా మార్చాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద 100 మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల వద్ద 100 మొక్కలు నాటాలి : ఎమ్మెల్యే సోలిపేట
ప్రభుత్వాసుపత్రుల వద్ద మొక్కలు నాటితే.. పచ్చదనం పెరుగుతుందని, ఆస్పత్రులు ఆరోగ్య కేంద్రాలుగా మారుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ జ్యోతి, ఎంపీపీ కొత్త పుష్పలత, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తౌడ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత, మున్సిపల్ కమిషనర్ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గుడ్న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్!