సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో ఉన్న అనుబంధాన్ని, వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో రాయపోలు ఎంపీపీ కల్లూరి అనిత, జడ్పీటీసీ యాదగిరి, ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాస్, రాయపోల్ తెరాస మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, రాయపోల్ రైతు బంధు అధ్యక్షుడు నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాయపోల్‌లో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సంస్మరణ సభ - సిద్దిపేట జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లా రాయపోల్‌లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.
రాయపోల్‌లో దివంగత నేత రామలింగారెడ్డి సంస్మరణ సభ
ఇవీ చూడండి: కుంగుతున్న కాలువలు... వృథాగా పోతున్న నీరు