సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని రెండు పడకల ఇండ్లు, ఆర్ అండ్ బీ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలు, అంగన్వాడీ, గ్రామ పంచాయితీ భవన నిర్మాణాలకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. దేశమంతా కరోనా వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటే.. తెలంగాణలో మాత్రం నిరాటంకంగా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - సిద్ధిపేట జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో స్థానిక శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశం కరోనా వల్ల విపత్కర పరిస్థితిలో ఉన్నా.. తెలంగాణలో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని అన్నారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే.. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖానికి మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే కాళ్లు, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని ప్రజలకు సూచించారు. కరోనా వచ్చిన తర్వాత ఆందోళన చెందేకంటే.. రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, జెడ్పీటీసీ లక్ష్మీ, పీఏసీఎస్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, వైస్ ఛైర్మన్ లింగాల రాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ