ముస్లింలు ఇంటిలోనే ప్రార్థనలు చేసుకోవాలి: ఎమ్మెల్యే సోలిపేట - mla solipeta rama linga reddy today news
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం మాదన్నపేట గ్రామ ముస్లింలకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రంజాన్ మాసం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారందరికీ స్థానిక మసీదులో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ముస్లిం సోదరులు అందరూ సామాజిక దూరం పాటిస్తూ... ఇంటిలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, లింగాల వెంకట్ రెడ్డి, గొట్టం బైరయ్య, గడ్డం హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.
mla solipeta rama linga reddy distribute the groceries to muslims
.