సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.
'ధాన్యం విక్రయించేటపుడు భౌతిక దూరం పాటించాలి' - mla solipeta rama linga reddy
ధాన్యం అమ్మకాలు, కొనుగోళ్లు జరిపేటప్పుడు రైతులు, సిబ్బంది భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా తొగుటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
తొగుటలో ధాన్యం కొనుగోలు కేంద్రం
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో రామలింగారెడ్డితో పాటు తొగుట సర్పంచ్ కొండల్ రెడ్డి, ఎంపీటీసీ లలిత, జడ్పీటీసీ ఇంద్రసేనా రెడ్డి, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.