సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పేద రైతు కుటుంబ సభ్యులకు రైతు బీమా ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందేజేశారు. తిమ్మాపూర్‌కు చెందిన రామవరం బాల్‌రెడ్డి, జోరబొంతల బాబు అనే ఇద్దరు రైతులు అనారోగ్యంతో మరణించగా... మంజూరైన రైతు బీమా ప్రొసీడింగ్స్ కాపీలను కుటుంబసభ్యులకు అందించారు.
చనిపోయిన రైతుల కుటుంబాలకు బీమా ప్రొసీడింగ్స్ అందజేత - farmers problems
అనారోగ్యంతో మరణించి రైతుల కుటుంబాలకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రైతుబీమా ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్‌లో రెండు కుటుంబాలకు ప్రొసీడింగ్ కాపీలను, పెద్దగుండవెల్లిలోని ఓ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు.
![చనిపోయిన రైతుల కుటుంబాలకు బీమా ప్రొసీడింగ్స్ అందజేత mla solipet ramalingareddy distributed raithu bheema cheques for former families](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7835198-301-7835198-1593523903984.jpg)
mla solipet ramalingareddy distributed raithu bheema cheques for former families
పెద్దగుండవెల్లికి చెందిన మల్లయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు తౌడ శ్రీనివాస్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ పండరి రాజా లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.