సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ బియ్యం పంపిణీ చేశారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాల వద్ద రేషన్ కార్డు లేనివారికి బియ్యం అందించడానికి ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేయడం ద్వారా సమకూర్చారని తెలిపారు. ఈ విధానాన్ని ఆచరణలోకి తెచ్చిన రెవెన్యూ అధికారులకు, పెద్ద మనసుతో బియ్యం డబ్బాలో బియ్యం వేసిన రేషన్ కార్డుదారులకు, అందుకు సహకరించిన రేషన్ డీలర్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
రేషన్ కార్డు లేని పేదలకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే - lockdown
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రేషన్ కార్డు లేని నిరుపేదలకు ఎమ్మెల్యే సతీష్‌కుమార్ బియ్యం పంపిణీ చేశారు. మెుత్తం నియోజకవర్గంలోని రేషన్ కార్డులేని పేదలను గుర్తించి వారికి కూడా బియ్యం అందేలా కృషి చేస్తామన్నారు.
ఒక హుస్నాబాద్ పట్టణంలోనే రేషన్ కార్డు లేని నాలుగు వందల మంది పేదలను గుర్తించామని ఎమ్మెల్యే సతీష్‌కుమార్ వెల్లడించారు. వీరితో పాటు మొత్తం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రేషన్ కార్డు లేని పేదలను గుర్తించి అందరికీ ఇదే విధంగా బియ్యం అందించేలా కృషి చేస్తామన్నారు. నిరుపేదలు, అనాథలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయ చంద్రారెడ్డి, ఏసీపీ మహేందర్, మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అలా జరిగితే కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్