పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని 20 వార్డులకు చెందిన కౌన్సిలర్లు.. వారి వారి వార్డులకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
హుస్నాబాద్‌లో పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే - pattanapragathi in siddipet district
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. అధికారులు ప్రజలు సమన్వయంతో పనిచేసి పట్టణాల్లో పారిశుద్ధ్యం, వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
హుస్నాబాద్‌లో పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రజలు కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ 10 రోజుల కార్యక్రమంలో ఏ క్షణమైనా ఏ పట్టణంలో అయినా మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తారని అందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.