సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ విపణిలో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర రూ.5,825లకు రైతులు పంటను అమ్ముకోని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
హుస్నాబాద్ లో సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ - హుస్నాబాద్ లో సీసీఐ కేంద్రం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ విపణిలో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను విక్రయించాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను పొందాలని సూచించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పత్తిలో తేమ శాతాన్ని సరిగా చూసుకొని, వాహనంలో పత్తి లోడును వేబ్రిడ్జి వద్ద కాంటా వేసుకొని రావాలని కోరారు. రైతుల కోరిక మేరకు సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధరను పెంచే విషయన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కాబట్టే రైతులు పడే బాధ ఆయనకు తెలుసని, త్వరలోనే కర్షకులకు న్యాయం జరిగేలా సీఎం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: త్వరలో ప్రారంభంకానున్న కొత్త కార్యాలయాలను పరిశీలించిన కలెక్టర్