తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే పర్యటన - mla satish kumar on urban progress at husnabad

పట్టణ ప్రగతిలో భాగంగా హుస్నాబాద్​లోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

mla satish kumar on urban progress at husnabad
పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే పర్యటన

By

Published : Mar 3, 2020, 5:55 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 2,17,18 వార్డులలో పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను... ప్రజలను, కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు.

హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. ఖాళీగా ఉన్న స్థలాలలో చెత్త వెయ్యకుండా, మురుగు నీరు నిలువకుండా... ఆ స్థలాల యజమానులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే పర్యటన

ఇవీచూడండి:పార్లమెంట్​లో కోమటిరెడ్డి ప్రశ్న... తోమర్ ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details