సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కరీంనగర్ రహదారిలో ఉన్న శ్రీ పద్మాక్షి ఫిల్లింగ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే సతీశ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు మంచి సేవలందించాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్‌లో కొత్త పెట్రోల్ బంక్ అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు. వ్యాపార పరంగా హుస్నాబాద్ గతంలో కంటే ఎంతో మెరుగైన అభివృద్ధిని సాధిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్‌కు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను, నిర్వాహకులను పరిచయం చేసుకున్నారు. గ్రామంలో కబడ్డి నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించిన ప్రో కబడ్డీ జాతీయ క్రీడాకారుడు గంగాధర మల్లేశ్‌ను ఎమ్మెల్యే అభినందించారు. మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు.