జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ పరుగు పోటీలను సీపీ జోయల్ డేవిస్‌తో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభానికి ముందు యువతీ, యువకులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
డ్రోన్ కెమెరాలు..
హుస్నాబాద్ డివిజన్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి దాదాపు వెయ్యి మంది పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా హుస్నాబాద్ ఎనే-అక్కన్నపేట అంబేద్కర్ చౌరస్తా మీదుగా.. తిరిగి హుస్నాబాద్ ఎనేకు చేరుకునే 21కే పరుగును ఎమ్మెల్యే, సీపీ జెండా ఊపి ప్రారంభించారు. పోటీ పర్యవేక్షణకోసం పోలీసుల డ్రోన్ కెమెరాలు వినియోగించారు.
తర్వాత 10కే, 5కే, యువతుల కోసం 5కే పరుగు పోటీలను ప్రారంభించారు. యువత భారీ సంఖ్యలో పాల్గొనడంతో హుస్నాబాద్ పట్టణంలోని ఎనే ప్రాంతంలో కోలాహలం నెలకొంది. రోడ్డు భద్రతకు సంబంధించి ప్రమాణం చేయించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందించారు.