తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ జన్మదిన వేడుకలు - ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, తెరాస నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలంటూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

mla satish kumar 55th birth day celebrations at husnabad in siddipet district
ఘనంగా ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ జన్మదిన వేడుకలను

By

Published : Sep 30, 2020, 8:27 PM IST

Updated : Sep 30, 2020, 11:25 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీశ్​కుమార్ 55వ జన్మదిన వేడుకలను ప్రజా ప్రతినిధులు, తెరాస పార్టీ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీమరకత లింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే క్షేమంగా ఉండాలని కోరుకుంటూ 108 కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస శ్రేణులు కేక్​ కట్​చేసి మొక్కలు నాటారు.

ఘనంగా ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ జన్మదిన వేడుకలను
ఘనంగా ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ జన్మదిన వేడుకలను
ఘనంగా ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ జన్మదిన వేడుకలను

కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు హాజరు కాలేకపోయారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్​ ఛైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కోహెడ మండలంలోని కూరేళ్ల గ్రామంలో సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు చోట్లు అనాథల పిల్లలకు పండ్లు, వృద్ధులకు బెడ్​షీట్లు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:జిల్లాకు 1.78 లక్షల చీరలు.. అక్టోబరు 9 నుంచి పంపిణీ

Last Updated : Sep 30, 2020, 11:25 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details