తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​

రైతుల కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

సతీశ్​ కుమార్​

By

Published : Oct 20, 2019, 8:08 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్​లో ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1835, బి గ్రేడ్ ధాన్యానికి రూ.1815 కనీస మద్దతు ధర చెల్లిస్తుందని చెప్పారు. ధాన్యాన్ని ఆరబెట్టి 17 శాతం తేమ లోపు ఉండే విధంగా చూసుకొని మార్కెట్​కు తీసుకు రావాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details