సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల గ్రామంలో కల్లం, రైతు వేదిక భవన నిర్మాణ పనులకు స్థానిక శాసన సభ్యులు సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కన్నపేట మండలం జనగాంలో సైతం రైతు వేదిక భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.
రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్ శంకుస్థాపన - ఎమ్మెల్యే సతీష్ కుమార్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో రైతు వేదిక, కల్లం నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేసి.. పనులు ప్రారంభించారు. రైతుల సమస్యల మీద నిరంతరం చర్చ జరగడానికే.. ముఖ్యమంత్రి రైతు వేదికల నిర్మాణం ఆలోచన చేశారని ఆయన అన్నారు.
![రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్ శంకుస్థాపన MLA Sathish Inaugurates Raithu vedika Cinstruction works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8051443-330-8051443-1594908736046.jpg)
రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీష్
రైతు బాగుండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.22 లక్షల వ్యయంతో రైతు వేదికల నిర్మాణానికి తెర తీశారని, రైతు సమస్యల మీద నిత్యం చర్చ జరిగి.. రైతాంగం సమస్యల్లో ఉండకుండా చేసేందుకే ఆయన ఈ ఆలోచన చేశారని ఎమ్మెల్యే అన్నారు. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒక రైతు వేదిక ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో రైతు వేదికకు ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. రైతులకు తగు సూచనలు చేస్తూ.. ప్రభుత్వం అందించే పథకాలు ఈ వేదిక ద్వారా రైతులకు చేరుతాయన్నారు.