సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తెరాస కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే సతీష్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమ పార్టీగా ఏర్పడిన తెరాస అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు గోదావరి జలాలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు.
ఉద్యమ పార్టీ నిత్య పోరాట స్ఫూర్తి - తెరాస జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే సతీశ్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తెరాస ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పార్టీ జెండా ఎగురవేశారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన పార్టీ... ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నెరవేర్చిందని కొనియాడారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి సాధనకు నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.
ఉద్యమ పార్టీ నిత్య పోరాట స్ఫూర్తి
95 శాతం వరకు గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయన్న ఎమ్మెల్యే అతి త్వరలో మిగిలిన పనులు కూడా పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. తెరాస అధినేత కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల సాధనకై నిరంతరం కృషి చేస్తామన్నారు.