తెలంగాణ

telangana

ETV Bharat / state

మరణించిన రైతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

సిద్దిపేట జిల్లా లింగంపేటలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హరితహారం నిర్వహించారు. ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఇటీవల లింగంపేటలో అనారోగ్యంతో మృతి చెందిన రైతు అంజయ్య కుటుంబాన్ని పరామర్శించి.. రైతు బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు.

మరణించిన రైతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
మరణించిన రైతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

By

Published : Jul 2, 2020, 3:46 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు. లింగంపేటలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో మొక్కలు నాటారు. ప్రజలందరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు.

లింగంపేటలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రైతు అంజయ్య కుటుంబాన్ని పరామర్శించి.. రైతు బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు. మండలంలోని పెద్ద మాసన్ పల్లిలో ఇటీవల మరణించిన చంద్రయ్య కుటుంబానికి రైతు బీమా ప్రొసీడింగ్స్‌, వడ్డెర కాలనీకి చెందిన విశ్వతేజకు రూ. 14 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.

ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details