సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు. మండలంలోని అల్మాస్పూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, చెప్యాల, అల్వాల, మల్లుపల్లి, అందే, లక్ష్మీనగర్, ధర్మారంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
సీసీరోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - dubbaka mla mla ramalinga reddy
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మిరుదొడ్డి మండంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
సీసీరోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మి , ఎంపీపీ గజ్జలసాయిలు, పీఏసీఎస్ ఛైర్మన్ బక్కివెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వీసా ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలో హెల్ప్లైన్లు