MLA Raghunandan Rao on MP Prabhakar Reddy Attack : మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై ఆ ప్రాంత ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ఈ ఘటనతో తనకు గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. అనవసరంగా తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తప్పు చేసిన వాళ్లు తమ పార్టీ కార్యకర్తలైతే స్వయంగా తానే తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తానన్నారు.
CM KCR on Kotha Prabhakar Reddy Murder Attempt : 'ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి నాపై జరిగినట్లే.. మాకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్మురేగిపోద్ది'
బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టి, తప్పుడు ప్రచారాలు చేసి.. బట్టకాల్చి తమ మీద పడేయాలని చూస్తున్నారన్న ఆయన.. నెట్టింట వచ్చే వార్తలను కార్యకర్తలు నమ్మవద్దని సూచించారు. ఈ క్రమంలోనే నిందితుడు వీ90 రిపోర్టర్ అని ఓ వెబ్‌సైట్‌లో ఉందని చెప్పారు. ఫేస్‌బుక్ పేజీలో కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు ఉన్నాయని.. నిందితుడు ఏ పార్టీ వ్యక్తో సీపీ చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దళితబందు రాలేదని ఆవేదనలో నిందితుడు దాడికి పాల్పడ్డాడని కొన్ని మీడియాల్లో వచ్చిందని రఘునందన్‌రావు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారని.. నిజానిజాలు తెలుస్తాయని స్పష్టం చేశారు.
Governor Reacted on MP Kotha Prabhakar Reddy Murder Attempt : 'ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి'
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి ఘటన దురదృష్టకరం. దాడికి నేనే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఘటనపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టి, తప్పుడు ప్రచారాలు చేసి.. బట్టకాల్చి మీద పడేయాలని చూస్తున్నారు. నిందితుడు ఏ పార్టీ వ్యక్తో సీపీ చెప్పి ఉంటే బాగుండేది. పోలీసులు విచారణ చేస్తున్నారు. నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి. - రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
Murder Attempt on MP Kotha Prabhakar Reddy : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. ఎన్నికల ప్రచారంలో ఉండగా కత్తితో దాడి
మరోవైపు దాడి తర్వాత బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారన్న రఘునందన్‌రావు.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగితే పూర్తి బాధ్యత సిద్దిపేట సీపీ తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ భౌతిక దాడులకు దిగుతోంది..: కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని ఖండిస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతికదాడులకు దిగుతోందని ఆరోపించారు. తమ నేతలను భౌతికంగా అంతం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో హింస, దాడులకు తావు లేదన్న ఆయన.. ఘటనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.
Telangana Assembly Election Polling Arrangements : ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల చర్యలు
మేమెప్పుడూ హింసను నమ్ముకోలేదు..: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను నమ్ముకోదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన ఆయన.. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలు వెల్లడించాలన్నారు. దాడి ఘటనపై విచారం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Telangana Assembly Elections 2023 : ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సీఈసీ కసరత్తు.. ఆకర్షణీయంగా పోలింగ్ కేంద్రాల ముస్తాబు