తెలంగాణ

telangana

ETV Bharat / state

'సోలిపేట మృతి ఉమ్మడి మెదక్​కు తీరనిలోటు' - ఎమ్మెల్యే రామలింగారెడ్డికి

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ సహచరుడిగా... తోటి ఎమ్మెల్యేగా ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఎమ్మెల్యే మృతికి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్​ రెడ్డి సంతాపం
ఎమ్మెల్యే మృతికి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్​ రెడ్డి సంతాపం

By

Published : Aug 6, 2020, 12:35 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించేవారని... తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుడిగా కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.

రామలింగారెడ్డి మృతి పట్ల... ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details