సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో తెరాస పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మాల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్గా ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హాజరయ్యారు. సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసికట్టుగా తెరాస పార్టీకి కట్టుబడి పనిచేయాలని కోరారు.
'సోలిపేట కుటుంబాన్ని భారీ మెజారిటీతో గెలిపించినపుడే నిజమైన నివాళి' - సిద్దిపేట జిల్లా తొగటలో తెరాస నాయకుల సమావేశం
సోలిపేట కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించి.. వారిని భారీ మెజారిటీతో గెలిపించినప్పడే ఆయనకు ఘన నివాళి అని ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుటలో ఏర్పాటు చేసిన తెరాస నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
'సోలిపేట కుటుంబాన్ని భారీ మెజారిటీతో గెలిపించినపుడే నిజమైన నివాళి'
సోలిపేట కుటుంబానికి టికెట్ కేటాయించి భారీ మెజారిటీతో గెలిపించినపుడే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ గడిల అనిత లక్ష్మారెడ్డి, కో ఆపరేటివ్ ఛైర్మన్ హరిక్రిష్ణ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ పోచయ్య, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితర పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'