సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వేములఘట్ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ సంగారెడ్జి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని జగ్గారెడ్డి కోరారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు తెరాస ప్రభుత్వం హయాంలో అన్యాయం జరిగిందనీ, ఈ నష్టాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూడుస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ఇవ్వాలని కోరారు.
అసెంబ్లీలో ప్రశ్నించే అధికారం ఇవ్వండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి - congress party campaign in dubbaka by election
దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ వేములఘట్ గ్రామంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
అసెంబ్లీలో ప్రశ్నించే అధికారం ఇవ్వండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హరీశ్ రావు తన మంత్రి పదవి, సిద్ధిపేట టికెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. దుబ్బాకలో ఓడిపోతే ఆయన మంత్రి పదవి, ఎమ్మెల్యే సీటు ఉండదని ఎద్దేవా చేశారు. ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే నియోజక వర్గం సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలకు ఆయన సూచించారు.
ఇదీ చదవండి:వెంటిలేటర్ల తయారీలో భారత్ భేష్