సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో 103 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పంపిణీ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు పారిశుద్ధ్య కార్మికులు తీరిక లేకుండా పనిచేస్తున్నారని అన్నారు.
103 మంది పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేసిన ఎమ్మెల్యే - Essential requirements for workers distribute mla ramalingareddy
లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కూలీలకు సాయం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో 103 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందజేశారు.
కరోనా వైరస్ పెరుగుతున్న వేళ పారిశుద్ధ కార్మికుల సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశావర్కర్లు ఇంటింటికి తిరుగుతూ తగిన మందులు ఇస్తూ ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు మిరుదొడ్డి ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ సుకూరు లక్ష్మి, వైస్ ఎంపీపీ రాజు, పీఎసీఎస్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, మిరుదొడ్డి ఎంపీటీసీ సుతారి నర్సింలు, మిరుదొడ్డి సర్పంచ్ రంగన బోయిన రాములు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల తెరాస నాయకులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :బత్తిని పేరుతో నకిలీ మెడిసిన్..