తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటింటికీ పర్యటన... వ్యాధులపై నేతల అవగాహన - సీజనల్ వ్యాధులపై అవగాహన

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులపై ప్రజాప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకలోని పలు వార్డుల్లో పర్యటించి స్థానికులకు అవగాహన కల్పించారు.

mla conducted awareness to people on seasonal  Diseases in dubbak
ఇంటింటికీ పర్యటన... వ్యాధులపై నేతల అవగాహన

By

Published : May 10, 2020, 4:45 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు.వార్డులోని పలు ఇళ్లలో నీళ్ళు నిల్వ ఉంచుకునే ట్యాంకులను శుభ్రం చేయించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని రోగాలు దరిచేరనివ్వొద్దని సూచించారు.

రోజుల తరబడి నీటిని నిల్వ ఉంచకూడదని వార్డులోని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు 13వ వార్డు కౌన్సిలర్ ఆశా సులోచన, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ పర్యటన... వ్యాధులపై నేతల అవగాహన
ఇంటింటికీ పర్యటన... వ్యాధులపై నేతల అవగాహన

ఇవీచూడండి:ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. చిన్నారికి కంటి చూపు

ABOUT THE AUTHOR

...view details