సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద పనిచేసే 200 మంది ఒప్పంద కార్మికులు పంపుహౌస్ వద్ద ఉన్న వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమను విధుల్లో నుంచి అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
'రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తే.. చెప్పకుండా తొలగించారు' - mission bhagiratha contract labor got terminated
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించారని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ఆందోళనకు దిగారు. ఈ పథకం కింద పనిచేసే 709 మంది కార్మికుల్లో 200 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కోమటిబండలోని భగీరథ పంపుహౌస్ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
గజ్వేల్‌లో భగీరథ కార్మికుల నిరసన
పథకం ప్రారంభించినప్పటి నుంచి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి, మిషన్ భగీరథను దేశానికే ఆదర్శవంతమైన పథకంగా తీర్చిదిద్దిన తమను తొలగించండం అన్యాయమని వాపోయారు. కరోనా వంటి కష్టకాలంలో తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఒప్పంద కార్మికుల నిరసన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేసుకుని వారికి సర్దిచెప్పగా కార్మికులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత