సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాటలోని స్థానిక హైస్కూల్ దగ్గరలో ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్ వాల్వ్ లీక్ అయ్యింది. దీనితో మంచి నీరంతా ఫౌంటెన్లా విరజిమ్ముతూ పక్కనున్న పొలాల్లోకి చేరింది. నీరంతా వృథాగా పోతుండటం వల్ల అటుగా వెళ్తున్న జనాలు దీనిని గమనించి సంబంధిత అధికారులుకు సమాచారం అందించారు.
దౌల్తాబాద్‌లోని మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ - పైప్‌లైన్ లీక్
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని మిషన్ భగీరథ మెయిన్ పైప్‌లైన్ లీక్ అవడం వల్ల మంచి నీరు వృథాగా పోయింది.
దౌల్తాబాద్‌లోని మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. అసలే రానున్నది వేసవికాలం కావున అప్రమత్తంగా వ్యవరించాలని స్థానికులు కోరారు.
ఇదీ చూడండి:గుత్తేదారుల నిర్లక్ష్యంతో.. నిలిచిపోయిన వంతెన నిర్మాణం