తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాల వల్లే యూరియా కొరత : ఏవో మల్లేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్లే యూరియా కొరత ఏర్పడిందని మిరుదొడ్డి ఏవో మల్లేశం రైతులకు వివరణ ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పడిన యూరియా కొరతను అధిగమిస్తామని.. రైతులందరికీ సకాలంలో యూరియా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Mirudoddi AO Said About urea Shortage
వర్షాల వల్లే యూరియా కొరత : ఏవో మల్లేశం

By

Published : Aug 19, 2020, 8:58 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్లే యూరియా కొరత ఏర్పడిందని, రైతులందరికీ సకాలంలో యూరియా అందిస్తామని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి ఏవో మల్లేశం రైతులకు హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా యూరియా సరఫరాలో జాప్యం జరిగిందని, జిల్లా అధికారుల సూచనలతో రైతులకు యూరియా కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. యూరియా కావాల్సిన రైతులకు మిరుదొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద టోకెన్లు పంపిణీ చేస్తామని, ప్రతీ రైతుకు సరిపడా యూరియా అందిస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 1270 టన్నుల యూరియా పంచినట్టు, గురువారం నాటికి మరో 75 టన్నుల యూరియా జరిగిందన్నారు.గురువారం నాటికి రోజుకు 75 టన్నుల యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులు కంగారు పడకుండా సకాలంలో ఎరువు అందుకొని పంటను కాపాడుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!

ABOUT THE AUTHOR

...view details