చెరువుకట్ట మీద నుంచి టిప్పర్ బోల్తా... - mididoddi
మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మట్టి తరలించే టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు.
చెరువుకట్ట మీద నుంచి టిప్పర్ బోల్తా...
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో స్థానిక జూనియర్ కళాశాల సమీపంలోని చెరువు కట్టపై నుంచి టిప్పర్ బోల్తా పడింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మట్టిని తరలించే వాహనం ధర్మాజీపేట వెళ్లే క్రమంలో అదుపుతప్పి వ్యవసాయ భూముల్లో బోల్తా పడింది. కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.