తెలంగాణ

telangana

ETV Bharat / state

30 రోజుల ప్రణాళిక కొనసాగింపుపై సమీక్ష - harish rao in siddipeta

30 రోజుల ప్రణాళిక కొనసాగింపుపై సిద్దిపేటలో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు.

30 రోజుల ప్రణాళిక కొనసాగింపుపై సమీక్ష

By

Published : Nov 17, 2019, 5:04 PM IST

సిద్దిపేటలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. 30 రోజుల కార్యచరణ ప్రణాళిక స్ఫూర్తి కొనసాగింపు, వ్యవసాయం రంగంపై సమీక్ష నిర్వహించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా... ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించినట్లే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని హరీశ్‌ రావు సూచించారు. డంపింగ్ యార్డు నిర్వహణకు వీలైనంత త్వరగా స్థలాలు గుర్తించి, ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

30 రోజుల ప్రణాళిక కొనసాగింపుపై సమీక్ష

ABOUT THE AUTHOR

...view details