ప్రపంచంలోనే తెలంగాణ ఒక విత్తన భాండగారంగా అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరి సీడ్స్ సిద్దిపేట జిల్లాలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పాములపర్తి గ్రామ శివారులోని కావేరి సీడ్స్ కంపెనీలో సెంటర్ అండ్ టెక్నాలజీ పరిశోధన సంస్థను రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు ప్రారంభించారు. సంస్థలో విత్తన పరిశోధన చేపట్టే విధివిధానాలను కంపెనీ ప్రతినిధులు, పరిశోధకులు మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లాలో కావేరి సీడ్స్ విత్తన పరిశోధన సంస్థ - సిద్దిపేట జిల్లాలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు
ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరి సీడ్స్ సిద్దిపేట జిల్లాలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనిని మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లాలో కావేరి సీడ్స్ విత్తన పరిశోధన సంస్థ