Ministers KTR Harishrao In Siddipet IT Hub : తెలంగాణ మంత్రుల్లో కేటీఆర్‌కు.. హరీశ్‌రావుకు మంచి ఫాలోయింగ్ ఉంది. రాష్ట్రంలో హరీశ్‌రావు ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రిగా చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఇక ముఖ్యంగా తన జిల్లా సిద్దిపేటలో హరీశ్ రావు చేసే సేవల గురించి తెలియని వారంటూ ఉండరు. దేశానికి తెలంగాణ మోడల్ అయితే.. తెలంగాణకు సిద్దిపేట మోడల్ అనే విధంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు హరీశ్ రావు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హరీశ్ రావు పాలనకు ఫిదా అయ్యారు. అదే విషయాన్ని చాలా సభల్లో కేసీఆర్ బహిరంగంగానే ప్రస్తావించి.. హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు.
ఇక మంత్రి కేటీఆర్ విషయానికి వస్తే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి వేలాది సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. కేటీఆర్‌కు సోషల్ మీడియాలోనూ.. బయటా సూపర్ క్రేజ్ ఉంది. మొత్తానికి ఈ బావాబావమరుదులు తెలంగాణలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఇక ఈ ఇద్దరు అప్పడప్పుడు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. సరదా ముచ్చట్లు పెడుతుండటం అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఒకే వేదికపై కూడా కనిపిస్తూ ఉంటారు. తాజాగా సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభోత్సవ వేడుకలోనూ ఈ ఇద్దరు మంత్రులు కలిశారు. ఒకే వేదికపై ఈ బావాబావమరిదిలను చూసిన అభిమానులు, కార్యకర్తలు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్న తీరు చూసి అందరు భలే సంబురపడ్డారు.
Siddipet IT Hub Inauguration : సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంబోత్సవంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కాముకుడు హరీశ్ అని కేటీఆర్ అనగా.. అంతర్జాతీయ వేధికలపై తెలంగాణ గౌరవాన్ని చాటుతున్నారంటూ కేటీఆర్‌ని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సభలో ఇద్దరు మంత్రులు ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం అక్కడున్న వారందరిని ఆకర్షించింది.