సిద్దిపేట జిల్లా తీగుల్ నర్సాపూర్‌లోని కొండపోచమ్మ ఆలయానికి కేటాయించిన నిధులతో అభివృద్ధి చేయాలని మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వేద పండితులు వాస్తు నిపుణులతో సంప్రదించి అద్భుతంగా ఆలయాన్ని రూపొందించాలని సూచించారు.
తిరుమల, యాదాద్రి తరహాలో కొమురవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మల్లన్న ఆలయం వద్ద భక్తులకు వసతి కోసం గదుల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రహదారి నిర్మాణానికి గతంలో మంజూరైన నిధులకు అదనంగా మరో మూడు కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.