తెలంగాణ

telangana

ETV Bharat / state

Fever Survey in Telangana: ఫీవర్ సర్వే ఎలా సాగుతోంది ?.. పరిశీలించిన మంత్రులు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Fever Survey in Telangana: కొవిడ్‌ కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. తొలిరోజు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి వెంటనే మెడికల్‌ కిట్‌ అందించారు. రాష్ట్రంలో రెండో రోజు జ్వర సర్వే కొనసాగుతుండగా... మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సర్వే తీరును పరిశీలించారు.

Fever Survey in Telangana , harish rao about vaccination
కొనసాగుతున్న ఫీవర్ సర్వే

By

Published : Jan 22, 2022, 2:07 PM IST

Fever Survey in Telangana : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే రెండో రోజు కొనసాగుతోంది. వైద్యబృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను లక్షణాలు అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నాయా అని ఆరా తీసి... వెంటనే మెడికల్‌ కిట్లు అందిస్తున్నారు. సర్వే జరుగుతున్న తీరును మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.

టీకా మస్ట్

ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేటలో ఫీవర్‌ సర్వే జరుగుతున్న తీరును హరీశ్‌ పరిశీలించారు. వివిధ వార్డుల్లో తిరిగిన మంత్రి.... స్థానికులు వ్యాక్సిన్‌ తీసుకున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 12 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించారు.

జ్వరం సర్వేలో ఇంటింటిని నేను పరిశీలిస్తున్నా. ఇప్పటికీ కొందరు సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకోలేదని తెలిసింది. వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలి. రెండో డోసును కచ్చితంగా తీసుకోవాలి. అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసు ఇస్తున్నాం. పిల్లలకు కూడా టీకా ఇస్తున్నాం. 15-18 ఏళ్ల వారికి టీకా అందుబాటులోకి వచ్చింది. అర్హులైన అందరూ టీకా తీసుకోవాలి.

-హరీశ్ రావు, ఆరోగ్యశాఖ మంత్రి

'నిర్లక్ష్యం వద్దు'

ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని మేదరబస్తీలో ఇంటింటి సర్వేను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వే

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ABOUT THE AUTHOR

...view details