సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించనున్న సమీకృత మార్కెట్‌ను మంత్రి పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్రయవిక్రయాలు క్రమ పద్ధతిలో జరిగే విధంగా మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు. బహుముఖ ప్రయోజనాలతో కూడిన మార్కెట్‌ను నిర్మించటం హర్షనీయమని కొనియాడారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని మంత్రి సూచించారు.
సమీకృత మార్కెట్‌ను పరిశీలించిన నిరంజన్ రెడ్డి - MINISTER GAJWEL VISIT
సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్‌లో ప్రారంభించనున్న సమీకృత మార్కెట్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. నవీన పద్ధతుల్లో ఏర్పాటు చేసిన మార్కెట్‌ను ఏర్పాటు చేయటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
![సమీకృత మార్కెట్‌ను పరిశీలించిన నిరంజన్ రెడ్డి MINISTER NIRANJAN REDDY VISIT GAJWEL MARKET](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5329009-thumbnail-3x2-ppp.jpg)
MINISTER NIRANJAN REDDY VISIT GAJWEL MARKET