తెలంగాణ

telangana

ETV Bharat / state

సోలిపేట మరణం దుబ్బాక ప్రజలకు తీరని లోటు: నిరంజన్ రెడ్డి - దుబ్బాక ఎమ్మెల్యే అస్తమయం

పత్రికా రంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, నిగర్వి, నిరాడంబరుడు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని కొనియాడారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.

సోలిపేట మరణం దుబ్బాక ప్రజలకు తీరని లోటు: నిరంజన్ రెడ్డి
సోలిపేట మరణం దుబ్బాక ప్రజలకు తీరని లోటు: నిరంజన్ రెడ్డి

By

Published : Aug 6, 2020, 12:28 PM IST

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పత్రికా రంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, నిగర్వి, నిరాడంబరుడని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడైన రామలింగారెడ్డితో తనది రెండున్నర దశాబ్దాల అనుబంధమని గుర్తు చేసుకున్నారు.

రామలింగారెడ్డి మరణం దుబ్బాక ప్రజలకు, తెలంగాణకు తీరని లోటు అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రభుత్వం దుబ్బాక ప్రజలకు అండగా నిలుస్తుందని వివరించారు. సోలిపేట కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details