తెలంగాణ

telangana

By

Published : May 29, 2020, 12:16 PM IST

Updated : May 29, 2020, 12:59 PM IST

ETV Bharat / state

ఆ పేరు ముఖ్యమంత్రి కేసీఆర్​కే సార్థకమైంది: కేటీఆర్​

కొండపోచమ్మ సాగర్​ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్​ పేరు కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లుగా సార్థకమైందని మంత్రి కేటీఆర్​ తన ట్విటర్​లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు.

minister-ktr-tweet-about-kcr-on-kondapochamma-project
ఆ పేరు కేసీఆర్​కే సార్ధకమైంది: కేటీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్​ పేరు కాల్వలు(K), చెరువులు(C), రిజర్వాయర్లు(R)గా సార్థకమైందని పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. కొండపోచమ్మ సాగర్​ ప్రారంభం సందర్భంగా మంత్రి ట్విటర్​లో వ్యాఖ్యానించారు. మేడిగడ్డ వద్ద 82 మీటర్ల ఎత్తు నుంచి కొండపోచమ్మకు 618 మీటర్ల వరకు గోదావరి జలాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుళదశ ఎత్తిపోత పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ముడేళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు.

కొండపోచమ్మ జలాశయం ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్​ తాగునీటికి శాశ్వత పరిష్కారం కోసం త్వరలో నిర్మించబోయే కేశవాపూర్​ జలాశయానికి అక్కడి నుంచే నీరు వస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ దూరదృష్టి వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని... ముఖ్యమంత్రికి మంత్రి ట్వటర్​లో ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి :మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!

Last Updated : May 29, 2020, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details