రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ వద్ద ఆగి.. ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయని విక్రయదారులను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఉన్న షాపుల నిర్వాహకులు తమకు వ్యాపారాలు సక్రమంగా జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్‌కు చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గజ్వేల్ మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కేటీఆర్ - గజ్వేల్ మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిశుభ్రత చర్యలు పరిశీలించారు.. వ్యాపారులతో మాట్లాడారు.
![గజ్వేల్ మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కేటీఆర్ minister ktr sudden visit to gajwel market in siddipeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8128262-732-8128262-1595420461160.jpg)
గజ్వేల్ మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్