ఆరేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని, గోదావరి జలాలతో మల్లన్న ఆశీస్సులతో... ఈ ప్రాంతం సశ్యశ్యామలం కానుందన్నారు. ప్రత్యేక తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి వెయ్యి కోట్లు వెచ్చించారని... నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్టు, త్వరలోనే భక్తుల దర్శనానికి సిద్ధం కానుందన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: ఇంద్రకరణ్ రెడ్డి - కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మంత్రి దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
![ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: ఇంద్రకరణ్ రెడ్డి minister indrakaran reddy visit komuravelli mallanna temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9832818-46-9832818-1607602264848.jpg)
ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: ఇంద్రకరణ్ రెడ్డి