రామలింగారెడ్డి కుటుంబానికి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ - రామలింగారెడ్డి కుటుంబానికి ఇంద్రకరణ్ రెడ్డి సానుభూమి
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటంబాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సేవలు చేశారని కొనియాడారు.
సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ
అనారోగ్యంతో మృతి చెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. పాత్రికేయునిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా దుబ్బాక ప్రజలకు ఎన్నో సేవలు చేశారన్నారు. ఆయన మరణం ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు. ఉద్యమకారునిగా, కవిగా, రచయితగా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.