తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిసరాల పరిశుభ్రతలో అందరూ భాగస్వాములు కావాలి'

సిద్దిపేట పట్టణంలో 'ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు' కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. డ్రైడే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

minister harishrao participated in dry day at siddipet
minister harishrao participated in dry day at siddipet

By

Published : Aug 30, 2020, 12:24 PM IST

పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేట 20వ వార్డు ముర్షద్​గడ్డలో నిర్వహించిన డ్రైడేలో ఆర్థిక మంత్రి హరీశారావు పాల్గొన్నారు. ఇంటింటా కలియ తిరిగిన మంత్రి... ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా... పరిసరాలను పరిశుభ్రపరిచాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి రాకుండా చూడాలన్నారు.

డ్రైడే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణ కోసం పరిశుభ్రత కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details