కరోనా నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటని మహిళలను అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో డ్రైడేలో మంత్రి పాల్గొన్నారు. తడి, పొడి హానికరమైన చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని గృహిణీలకు సూచించారు.
కరోనా నివారణకు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు: హరీశ్ - డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్
సిద్దిపేట జిల్లా కేంద్రంలో డ్రైడేలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా.. ఇంట్లో, పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తికాకుండా చూడాలని ప్రజలను కోరారు.
కరోనా నివారణకు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు: హరీశ్
పట్టణంలోని హనుమాన్ నగర్ లో డ్రైడేలో పాల్గొని... ఇంటింటా కలియ తిరిగారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా.. మీ ఇంట్లో, పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి కాకుండా చూడాలని ప్రజలకు మంత్రి సూచన చేశారు. డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణమవుతున్న దోమల నివారణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.