సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన అంగన్ వాడీ కార్యకర్త కరికే కళావతి జూన్ 2న జెండా ఆవిష్కరణ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళావతిని, వారి కుటుంబీకులకు మంత్రి హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.
మీకేం కాదు... అధైర్యపడొద్దు: మంత్రి హరీశ్ - అంగన్వాడీ కార్యకర్త కళావతిని మంత్రి హరీశ్ పరామర్శ
జూన్2న సిద్దిపేట జిల్లా దొమ్మాట గ్రామంలో జెండా ఆవిష్కరణ సమయంలో విద్యుత్‌తీగలు తగిలి గాయపడిన అంగన్వాడీ కార్యకర్త కళావతిని ఎంపీ ప్రభాకర్‌తో కలిసి మంత్రి హరీశ్ పరామర్శించారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
మీకేం కాదు... అధైర్యపడొద్దు: మంత్రి హరీశ్
బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేశ్‌ను మంత్రి ఆదేశించారు. అన్ని విధాలుగా బాధితురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని, ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు తెలిపారు. తక్షణ అవసరాల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని మంత్రి అందించారు.