సిద్దిపేట జిల్లాలోని జూనియర్ కళాశాలల విద్యార్థులు ఫలితాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని... ఆ దిశగా అధ్యాపకులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గత సంవత్సరం పదో తరగతి ఫలితాలలో జిల్లా రెండో స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.