తెలంగాణ

telangana

ETV Bharat / state

రబీ కొనుగోళ్లపై మంత్రి హరీశ్​రావు సమీక్ష - latest news on Minister Harish Rao's review on rabi purchases in siddipet district

సిద్దిపేటలోని కలెక్టరేట్​ కార్యాలయంలో మంత్రి హరీశ్​రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రబీ కొనుగోళ్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Minister Harish Rao's review on rabi purchases in siddipet district
రబీ కొనుగోళ్లపై మంత్రి హరీశ్​రావు సమీక్ష

By

Published : Mar 31, 2020, 5:46 AM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ గ్రామానికి ఇద్దరు అధికారులను నియమించి.. గ్రామాల వారిగా రబీ కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రవాణా, హమాలీల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.

జిల్లాలోని వరి కోత యంత్రాల యాజమాన్యాలతో సంప్రదించి.. వాటికి సంబంధించిన స్పేర్ పార్టులు, పనిముట్లపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. హార్వెస్టర్లకు ప్రత్యేక పాసులు జారీ చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వారంతా వలస కార్మికులుగా గుర్తించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులు, అనాథలు, జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న వలస కార్మికులను గుర్తించి వారికి బియ్యం, నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు.

సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.

రబీ కొనుగోళ్లపై మంత్రి హరీశ్​రావు సమీక్ష

ఇదీ చూడండి:-తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details