తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో మంత్రి హరీశ్‌ రావు పర్యటన - దుబ్బాకలో మంత్రి హరీశ్‌ రావు పర్యటన

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు పర్యటించారు. 9 వార్డుల్లో రూ. కోటి 85 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతో చింతమడకకు వచ్చినప్పుడు అభివృద్ధి కోసం రూ. పది కోట్లు ఇచ్చారని మంత్రి తెలిపారు.

దుబ్బాకలో మంత్రి హరీశ్‌ రావు పర్యటన
దుబ్బాకలో మంత్రి హరీశ్‌ రావు పర్యటన

By

Published : Sep 16, 2020, 6:19 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు పర్యటించారు. 9 వార్డుల్లో రూ. కోటి 85 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, రూ. 85 లక్షలతో వెజ్, నాన్ వెజ్ నూతన మార్కెట్‌ను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతో చింతమడకకు వచ్చినప్పుడు అభివృద్ధి కోసం రూ. పది కోట్లు ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టే దుబ్బాకపై ముఖ్యమంత్రికి ప్రేమ ఉందన్నారు. దుబ్బాకలో ఫైర్ స్టేషన్ కావాలని రామలింగారెడ్డి అడగ్గానే మంజూరు చేశారన్నారు. ఇవాళ దుబ్బాకలో తాగునీటి సమస్య గెలిచిన ఘనత కూడా కేసీఆర్‌దే అని పేర్కొన్నారు. దుబ్బాకలో అడిషనల్ కలెక్టర్ చొరవ చూపి అదనపు టాయిలెట్స్ కూడా కట్టించారని హరీశ్‌ రావు వెల్లడించారు.

ఇదీ చదవండి:నిరుపేదలకు సహాయం.. సీఎం సహాయనిధి: మంత్రి హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details