సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీ పర్పస్ హైస్కూల్లో తాత్కాలికంగా కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
'తాత్కాలిక మార్కెట్లో.. సౌలత్ మంచిగుంది సార్' - temporary vegetables market in siddipet
కూరగాయలు విక్రయించేటప్పుడు, కొనేటప్పుడు భౌతిక దూరం పాటించాలని రాాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలో తాత్కాలిక రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
!['తాత్కాలిక మార్కెట్లో.. సౌలత్ మంచిగుంది సార్' minister harish rao in siddipet market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6877992-474-6877992-1587450372891.jpg)
తాత్కాలిక మార్కెట్లో మంత్రి హరీశ్ రావు
మార్కెట్లో విక్రయదారులతో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కూరగాయల ధరలు, సౌకర్యాలపై ఆరా తీశారు. కూరగాయలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు భౌతిక దూరం పాటించాలని సూచించారు. మార్కెట్లో వసతులన్నీ బాగా ఉన్నాయని విక్రయదారులు మంత్రికి తెలిపారు.